దేవరకద్ర: ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం

76பார்த்தது
దేవరకద్ర నియోజకవర్గం కౌకుంట్ల మండల కేంద్రంలో ఆదివారం సాయంత్రం భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీజేపీ మండలం అధ్యక్షులు సంఘాల రవీందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు కోట్ల శ్రీనివాస రెడ్డి బీజేపీ జెండా ఆవిష్కరణ చేశారు. వారు మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాలో అత్యధిక స్థానాలను బీజేపీ గెలుచుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி