మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, ఎస్పీ జానకి, ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డిలు ఆదివారం సీఎం కప్-2024 కాగడను వెలిగించి, ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. స్టేడియం నుండి మెట్టుగడ్డకు ర్యాలీలో నిర్వహించారు. దేవరకద్ర ఎమ్మెల్యే మాట్లాడుతూ. గ్రామీణ స్థాయి నుండి ప్రపంచ స్థాయి వరకు క్రీడాకారులను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో సీఎం కప్ పై అవగాహన కల్పించేందుకు టార్చ్ ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు.