ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని లోన్ యాప్ల నిర్వాహకులు చెలరేగిపోతున్నారు. వారి వలలో పడి రుణాలు తీసుకున్న అమాయకులు తిరిగి చెల్లించలేనప్పుడు వారి వేధింపులు తాళలేక తనువు చాలిస్తున్నారు. ఇటువంటి సంఘటనల్లో కొన్ని మాత్రమే వెలుగులోకి వస్తున్నాయి. నిర్వాహకుల వేధింపులు, పరువు, ప్రతిష్టలు రోడ్డున పడతాయనే భయంతో ఆందోళనలో ఏం చేయాలో తెలియక ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు.