TG: హనుమాన్ జయంతి సందర్భంగా శనివారం మద్యం దుకాణాలు మూసివేయాలని సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి ఆదేశాలు జారీ చేశారు. గ్రేటర్ హైదరాబాద్‌లోని ట్రై కమిషనరేట్ల పరిధిలోని అన్ని ప్రాంతాల్లోనూ వీర హనుమాన్ శోభాయాత్రలు జరగనున్నాయి. ముందు జాగ్రత్తగా ఇవాళ ఉ. 6గంటల నుంచి ఆదివారం ఉదయం 6 వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని అధికారులు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.