రాజన్న సిరిసిల్ల (D) బోయిన్‌పల్లి (M) వెంకట్రావుపల్లి గ్రామంలో వారం రోజుల క్రితం కాంగ్రెస్ నుండి BRS పార్టీలోకి కొంతమంది యువకులు జాయిన్ అయ్యారని సోషల్ మీడియాలో పోస్టు చేసినందుకు మాజీ సర్పంచ్ బూర్గుల నందయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో మార్గమధ్యంలో వెంకట్రావుపల్లిలో కేటీఆర్ ఆగి నందయ్య పరామర్శించారు. అక్రమ కేసు గురించి సిరిసిల్ల SPకి కాల్ చేసి వెంటనే బోయిన్‌పల్లి SI మీద చర్యలు తీసుకోకపోతే, మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.