AP: పోసాని కృష్ణమురళిని సీఐడీ అధికారులు కస్టడీలో తీసుకున్నారు. గుంటూరు జిల్లా జైలు నుంచి ఆయనను జీజీహెచ్‌కు తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం గుంటూరు సీఐడీ కార్యాలయానికి తీసుకురానున్నారు. సా.5 గంటల వరకు విచారించనున్నారు. కాగా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేశ్‌పై అసభ్యపదజాలంతో దూషించినందుకు పోసానిపై సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.