ఇల్లందు నియోజకవర్గ గార్ల మండల గణేష్ యువసేన ఆధ్వర్యంలో రతన్ టాటాకు నివాళి అర్పించారు. వారి మరణం దేశానికి పెద్ద లోటని, ఎన్నో సంస్థలు ఏర్పాటు చేసి ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా కరోనా లాంటి విపత్కర పరిస్థితులలో సైతం ఉద్యోగులను ఎవర్ని కూడా తొలగించకుండా గొప్ప మనసుని చాటుకున్నారన్నారు. గణేష్ యువసేన సభ్యులు కాల విశాల్ జైన్, పతంగి ప్రవీణ్, ఉపేందర్, కోటేష్ రోహిత్, రేవంత్, తదితరులు పాల్గొన్నారు.