సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల జీతాలను ప్రతి నెల 7వ తేదీలోగా సింగరేణి యాజమాన్యమే బ్యాంక్ ఖాతాలో జమ చేయాలని ఐఎఫ్టియు నాయకులు శనివారం మణగురు సింగరేణి డైరెక్టర్ ఎన్వికే శ్రీనివాస్, జీఎం సూర్యనారాయణకి వినతిపత్రాలు అందజేశారు. సింగరేణి వ్యాప్తంగా పనిచేస్తున్న అన్ని విభాగాల కాంట్రాక్ట్ కార్మికులకు, ఎస్ఎంఎస్ ప్లాంట్, ఉద్యానవన కాంట్రాక్ట్ కార్మికులకు 15వ తేదీ నాటికి కూడా వేతనాలు అందడం లేదన్నారు.