పినపాక మండల పరిధిలోని పలు గ్రామాలలో గల ప్రభుత్వ పాఠశాలలను శుక్రవారం మండల విద్యాశాఖ అధికారి నాగయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలకు సంబంధించిన పలు రికార్డులను పరిశీలించారు. ఉపాధ్యాయుల పనితీరును పరిశీలించి, పాఠశాల అభివృద్ధికి పలు సూచనలు చేశారు. అనంతరం ఎంపీపీఎస్ పెంటన్న గూడెం, ఎంపీపీఎస్ మడతన కుంట, తదితర పాఠశాలలను సందర్శించి విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు.