పినపాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడిగా తరుణ్ రెడ్డి నియామకమై ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా బుధవారం మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును తరుణ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన తరుణ్ రెడ్డిని ఎమ్మెల్యే పాయం అభినందించారు. పార్టీ గెలుపులో యువజన నాయకుల పాత్ర కీలకమన్నారు.