అధిక ఫీజులపై స్పందించాలని కోరుతూ మణుగూరు ఎంఈవో స్వర్ణ జ్యోతికి సామాజిక సేవకులు కర్నె బాబురావు శుక్రవారం వినతి పత్రం అందజేశారు. ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులు చదువుకోవాలంటే తల్లిదండ్రులు చదువు కొనాల్సిన పరిస్థితి ఉందన్నారు. ప్రభుత్వాలు ప్రోత్సహించినా, ప్రభుత్వ పాఠశాలలో ఆశించిన స్థాయిలో విద్యాబోధన మెరుగు పడలేదని వెల్లడించారు.