మణుగూరు ఏఐటీయూసీ రాష్ట్ర కార్యాలయంలో బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశంలో బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు వేర్పుల మల్లికార్జున్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బిల్డింగ్ వర్కర్స్ కార్మికులకు ప్రత్యేక సంక్షేమ బోర్డులను ఏర్పాటు చేయాలని అన్నారు. బిల్డింగ్ వర్కర్లకు ప్రభుత్వం సౌకర్యాలు కల్పించాలని కోరారు.