సెప్టెంబర్ 23న జరిగే బ్లాక్ డే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు కార్మికులకు పిలుపునిచ్చారు. శుక్రవారం మణుగూరులోని సీపీఐ కార్యాలయంలో జరిగిన అఖిలపక్ష కార్మిక సంఘాల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. కార్మికవర్గం రక్త తర్పణం చేసి పోరాడి హక్కులు సాధిస్తే కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం కార్మికుల శ్రమను కార్పొరేట్ శక్తులకు చౌకగా కట్టబెడుతుందన్నారు.