గిరిజనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏజెన్సీ డీఎస్సీని నిర్వహించాలని పీవైఎల్ జిల్లా కార్యదర్శి రవి డిమాండ్ చేశారు. బుధవారం ఆళ్లపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వంలో జిఓ నెంబర్ 3ని రద్దు చేయడంతో గిరిజనులకి తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 3ను పునరుద్ధరించాలని పేర్కొన్నారు.