రైతుల ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 28 తేదీన జరిగే కలెక్టరేట్ ముట్టడి విజయవంతం చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి కొమరం సత్యనారాయణ అన్నారు. ఆదివారం ఆళ్లపల్లి మండలంలోని పాతూరు గ్రామంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం జరిగే కలెక్టరేట్ ముట్టడికి రైతులు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు.