పినపాక పట్టినగర్ బ్రిడ్జి వద్ద కిన్నెరసాని ఆదివారం ఉధృతిగా ప్రవహించడంతో జలపాతాన్ని చూడటానికి స్థానికులు భారీగా తరలివస్తూ బ్రిడ్జి పైన రహదారికి మధ్య ఫోటోలు సెల్ఫీలు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో పలు వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ఎవరి గోల వాడిది అన్న చందంగా వర్షంకి ఇల్లు వాకిలి ముంచెత్తి కొందరు బాధపడుతున్నారు రహదారిపై నీరు ప్రవహిస్తూ వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.