భద్రాది జిల్లాలో సిపిఐకి తిరుగులేదని, జిల్లాలో సిపిఐ నిర్ణయాత్మక శక్తిగా ఉందని, రానున్న కాలంలో మరిన్న సమరశీల పోరాటాల ద్వారా పార్టీని మరింత ప్రజలకు చేరువచేస్తామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేనిసాంబశివరావు అన్నారు. రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన సందర్భంగా సిపిఐ భద్రాది కొత్తగూడెం జిల్లా సమితి ఆధ్వర్యంలో స్థానిక కొత్తగూడెం క్లబ్ లో కూనంనేనికి శుక్రవారం ఏర్పాటు చేసిన అభినందన సభలో కూనంనేని మాట్లాడారు. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్. కె. సాబీర్ పాషా అధ్యక్షతన శనివారం జరిగిన సభలో కూనంనేని మాట్లాడుతూ అనేక మంది యోధులు కమ్యూనిస్టు ఉద్యమ వ్యాప్తికి కృషి చేశారని పేర్కొన్నారు.
భద్రాది జిల్లా ప్రజల ప్రేమ, అప్యాయతలు, ప్రముఖుల సహకారం తాను ఈ స్థితికి ఎదగడానికి కారణమయ్యాయని, ప్రజలతో మమేకమై మరింతగా పనిచేసానని అన్నారు. ఎంపిపిగా, ఎమ్మెల్యేగా పనిచేస్తున్న కాలంలో ఉమ్మడి జిల్లా ప్రజలు అందించిన సహకారం మరువలేనిదన్నారు. టాడా కేసులు, పోలీసుల నిర్బందాలు ఎదురైనప్పుడు ఈ జిల్లా ప్రజలు అంగా నిలిచారని తెలిపారు. ఎన్నో ఆటుపోట్లుతో కమ్యూనిస్టు పార్టీ ఎదిగిందని, పార్టీ విస్తరణన వెనుక ప్రతీ కార్యకర్త కృషి, త్యాగం దాగి ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితిలో ఎన్నికల్లో పోత్తులు అనివార్యమవుతున్నాయని, మతోన్మాద బిజెపిని ఎదుర్కొనేందుకు టీఆర్ఎస్కు మునుగోడు ఎన్నికల్లో మద్దతు ప్రకటించడం అనివార్యమైందన్నారు.
టీఆర్ఎస్కు మద్దతు ఇచ్చినప్పటికి ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో రాజీపడే పరిస్థితి ఉండబోడని స్పష్టం చేశారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాగం హేమంతరావు మాట్లాడుతూ. పోడు సమస్య, సింగరేణి, ఆర్టీసి, సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులు, రైతులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి పోరాట ఎజెండాను రూపొందించుకొని ముందుకు సాగుతామన్నారు.