కొత్తగూడెం, బాబుక్యాంపుకు చెందిన అరుణ్ బంటి అనే యువకుడు అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ బొమ్మను గీశాడు. అంబేద్కర్ అంటే తనకు ఎంతో ఇష్టమని, స్వాతంత్ర సమరయోధుల చిత్రాలు గీయటం తనకి ఎంతో ఆసక్తికరమని, తన ఇంటి నిండా దేశ నాయకుల చిత్రాలు ఉంటాయని చెప్పుకొచ్చారు. యువత చెడు అలవాట్లకు బానిస అవకుండా ఏదో ఒక లక్ష్యం ఉండాలని ఆదివారం ఆయన అన్నారు.