జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామంలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ సిఫారసు మేరకు ప్రభుత్వం కాకర్లలో నూతన విద్యుత్ సబ్స్టేషన్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో శనివారం కాకర్ల గ్రామంలో విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణం కోసం ఎంపిక చేసిన స్థలాన్ని రెవెన్యూ ఇన్స్పెక్టర్ తిరుపతిరావు, విద్యుత్ శాఖ ఏఈలు పరిశీలించారు. నిర్మాణానికి సంబంధించిన పలు సూచనలను స్థానిక గ్రామ ప్రజలను అడిగి తెలుసుకున్నారు.