తెలంగాణ బాష, యాసకు గుర్తింపు తీసుకొచ్చిన మహనీయుడు కాళోజీ నారాయణరావు అని అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ కొనియాడారు. కాళోజీ జయంతి సందర్భంగా కలెక్టరేట్లో ఆయన చిత్రపటానికి సోమవారం నివాళులర్పించారు. ఉమ్మడి ఏపీ శాసనమండలి సభ్యుడిగా, తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడిగా పనిచేసిన కాళోజీ. తెలంగాణ అస్తిత్వం కోసం పరితపించేవారని పేర్కొన్నారు. తెలంగాణ సాధన ఉద్యమంలో జైలు జీవితం గడిపారన్నారు.