టేకులపల్లి గ్రామం చెందిన ఇ. నిరోష (23) గర్భిణీ మహిళలకు కొత్తగూడెం ప్రాంతం రామవరం మాత శిశు ఆస్పత్రి నందు ఆదివారం నాడు ఆపరేషన్ కొరకై రక్తం తక్కువగా ఉండటంతో అత్యవసర పరిస్థితిలో కుటుంబ సభ్యులు హనుమాన్ జిమ్ బ్లడ్ ఫౌండర్స్ వారికి చరవాణి ద్వారా సంప్రదించారు. ఈ నేపథ్యంలో నిండు ప్రాణాలు కాపాడాలని తపనతో కమలాకర్ తన మిత్రుడు పూర్ణచందర్ ను సంప్రదించగా వెంటనే రక్తదానం చేశారు. అనంతరం పండంటి బాబుకు జన్మనిచ్చిందని తల్లిదండ్రులు స్వయంగా ఫోన్ చేసి సంతోషాన్ని వ్యక్తపరిచారు. రక్తదానంకు సహకరించిన హనుమాన్ జిమ్ బ్లడ్ ఫౌండర్ కమలాకర్ మరియు పూర్ణచందర్ లకు వారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. గతంలో కూడా అనేక మందికి రక్తదానం చేసి ప్రాణదానం చేశామని ప్రతి ఒక్కరు రక్తదానం చేయడంలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా ఫౌండర్ సభ్యులు కోరారు.