ఇండియన్ రెడ్ క్రాస్ సోసైటీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శాఖ వారి ఆధ్వర్యంలో చలి తీవ్రత దృష్ట్యా 150 ఉలెన్ బ్లాంకెట్లను మారుమూల గిరిజన గ్రామాలైన చెన్నాపురం, పలు గ్రామాలలో నిరుపేదలైన కుటుంబాలను గుర్తించి ఆదివారం పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ ఉలెన్ బ్లాంకెట్స్ ఇండియన్ రెడ్ క్రాస్ సోసైటీ రాష్ట్ర శాఖ వారు కె. మదన్ మోహాన్ రాష్ట్ర కార్యదర్శి వారు ప్రత్యేకంగా భద్రాచలంనకు అందజేశారు.