సుజాత నగర్ మండలంలోని సుజాతనగర్ నుండి సీతంపేట వరకు వెళ్లే మార్గమధ్యలో ఎదుల్ల వాగు పై ఉన్న బ్రిడ్జి గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు బ్రిడ్జి సగం మేర కిందికి రెండు స్లాబుల వరకు కుంగిపోయింది. గతంలో కురిసిన భారీ వర్షాలకు కొద్ది మేర కుంగిన వంతెన ఆదివారం పూర్తిస్థాయిలో కుంగింది. దీంతో ఆ బ్రిడ్జి గుండా ప్రయాణించే సీతంపేట బంజర సీతంపేట, కోమటిపల్లి నిమ్మలగూడెం గరిపేట వరకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. 6 కోట్ల 28 లక్షలతో రూపాయలతో ఇటీవల నూతనంగా నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణం పనులు ఇప్పుడు ఉన్న బ్రిడ్జి పక్కన జరుగుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి నూతన బ్రిడ్జి నిర్మాణాన్ని నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని సుజాతనగర్ మండల ప్రజలు వివిధ పార్టీల నాయకులు కోరుతున్నారు.