భారీ వర్షాలతో జిల్లాలో డెంగీ, మలేరియా జ్వరాలు ప్రబలుతున్నందున ఆరోగ్య అత్యయిక స్థితి ప్రకటించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేసింది. కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా చేపట్టింది. జ్వరాలతో ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లే రక్త కణాలు తక్కువగా ఉన్నాయంటూ కొందరు దోచుకుంటున్నారని, కలెక్టర్ స్పందించి జిల్లా ప్రధానాసుపత్రి, మండలాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రక్త నమూనా పరీక్షలు పెంచేలా చూడాలని కోరారు.