చర్ల మండలం విజయకాలనీకి చెందిన బట్ట మంగవేణి, శ్రీరాములకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.పెద్దమ్మాయికి చిన్నప్పుడు హైఫివర్ రావటంతో అప్పటినుంచి చెవులు వినబడవు. ఆర్థిక ఇబ్బందులు కుటుంబ సమస్యల కారణంగా చికిత్సకోసం మీ కోసం మేమున్నాం టీం ఆశ్రయించారు. ఫండ్ రైజింగ్ పోస్టు ద్వారా పలువురి దాతల సహకరాంతో సేకరించిన 14000 రూపాయలను వారి కుటుంబ సభ్యులకు అందించారు.