గిరిజన రిజర్వేషన్ సాధన పోరు పాదయాత్ర భద్రాచలం నుండి హైదరాబాద్ వరకు 17 రోజులు 350 కీలో మీటర్ల పాదయాత్ర బుధవారం నాడు గిరిజన సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆద్వర్యంలో, భద్రాచలం నుండి ప్రారంభమైంది. భద్రాద్రి జిల్లా ఎల్ హెచ్ పి ఎస్ జిల్లా అధ్యక్షులు రమేష్ నాయక్ 15 కిలోమీటర్లు మేర పాదయాత్రలో పాల్గొని మాట్లాడుతూ గిరిజన రిజర్వేషన్లను 10% శాతం పెంచాలని, గోర్ బంజారా బోలిని 8వ షెడ్యూల్డ్లో చేర్చాలని, గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూములకు హక్కు పత్రాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ పాదయాత్రలో ఇందల్ రాథోడ్, జె ఏ సి చైర్మన్, అశోక్ రాథోడ్, నాయకురాలు రవి నీలా నాయక్, రాష్ట్ర అద్యక్షుడు, ఎల్ ఎస్ ఓ నాయకులు మంగిలాల్ నాయక్, అధ్యక్షులు మెహన్ నాయక్, బాబు నాయక్, శివ నాయక్ తదితరులు పాల్గొన్నారు.