పోడు భూములు ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యాన గిరిజనులు నిరసన తెలిపారు. శనివారం చర్ల మండలం అంబేద్కర్ సెంటర్ నుండి ర్యాలీ చేపట్టారు. అనంతరం రేంజర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. చర్ల రేంజర్ ఉపేందర్ కి వినతిపత్రం అందించారు. స్పందించిన ఆయన పోడు భూములపై విచారణ చేయిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సతీష్, నరేష్. సమ్మక్క నాగలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.