66 మందికి వైద్య పరీక్షలు

366பார்த்தது
66 మందికి వైద్య పరీక్షలు
చర్ల మండలం సత్య నారాయణ పురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న కుర్నపల్లి గ్రామంలో డాక్టర్ దివ్య నయన అధ్వర్యంలో మంగళవారం వైద్య శిబిరం నిర్వహించారు. ఇంటింటికీ సర్వే నిర్వహించారు. ఆరుగురికి జ్వరాలు ఉన్నట్లు గుర్తించారు. 66 మంది కి సాధారణ వ్యాధులకు చికిత్స చేశారు. కార్యక్రమంలో డిపిఎంఓ సత్య నారాయణ, హెచ్ఈఓ బాబురావు, ఎంఎల్ హెచ్ పి సంధ్య, హెల్త్ అసిస్టెంట్లు వర ప్రసాద్, కవిత, తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி