గిరిజన పి ఎం హెచ్ హాస్టల్ వర్కర్ల కు రావలసిన బకాయి వేతనాలలో నాలుగు నెలల వేతనాలు చెల్లించేందుకు భద్రాచలం ఐటిడిఏ పిఓ రాహుల్ అంగీకరించారు. ఈమేరకు సోమవారం పిఓ ని కలిసిన పి ఎం హెచ్ వర్కర్లకు పిఓ స్పష్టం చేశారు. రెండు రోజులలో కార్మికుల అకౌట్లలో వేతనాలు జమ అవుతాయని తెలిపారు.సిఐటియు జిల్లా అద్యక్షులు బ్రహ్మాచారి ఆద్వర్యంలో పిఓ ని కలిసి సమస్యలపై చర్చించారు.