భద్రాచలం పట్టణనికి చెందిన యువతి అదృశ్యమైన సంఘటనపై ఎస్సై పీవీఎన్ రావు శుక్రవారం కేసు నమోదు చేశారు. శుక్రవారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన యువతి సాయంత్రం వరకు తిరిగి రాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో కేస్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.