అశ్వారావుపేట మండల పరిధిలోని వినాయకపురం నుంచి నారాయణపురం వెళ్లే ప్రధాన రహదారిపై ఒక కొండచిలువ స్థానికులకు కనిపించింది. వెంటనే అప్రమత్తమై దానిని హతమార్చారు. తాము ఇప్పటివరకు ఈ ప్రాంతంలో ఇంత పెద్ద కొండచిలువను చూడలేదని స్థానికులు, రైతులు చెబుతున్నారు. సుమారు 12 అడుగుల ఉండడంతో భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇంకా ఏమైనా ఈ ప్రాంతంలో ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.