జర్నలిస్ట్ అంగల తిరుపతి పై దాడి చేసిన అక్రమ మైనింగ్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని వికలాంగుల సంఘం జిల్లా అధ్యక్షులు అనిల్ కోసన్ కార్ సిర్పూర్ లో శనివారం డిమాండ్ చేశారు. వార్త సేకరణ నిమిత్తం ఫోటోల కోసం మైనింగ్ జరుగుతున్న చోటుకి వెళ్లగా అక్రమ మైనింగ్ నిర్వాహకులు జర్నలిస్ట్ పై దాడి చేసి నానా రకాలుగా తిట్టడం సరికాదాన్నారు. పోలీసులు తక్షణమే దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చెయ్యాలని డిమాండ్ చేశారు.