కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలంలో వరదల వల్ల నష్టపోయిన పంటలకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ శుక్రవారం రైతులు, బీజేపి నాయకులు రాస్తా రోకో నిర్వహించారు. పంట నష్ట అంచనాలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వ్యవసాయ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో వ్యవసాయ కమిషనర్ బి. గోపిని కలిసిన సిర్పూర్ శాసనసభ్యులు డా. పాల్వాయి హరీష్ బాబు లేఖను అందించినట్లు నాయకులు తెలిపారు.