కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ డీఎస్పీగా రామాంజన్ శనివారం తన బాధ్యతలను స్వీకరించారు. గత మూడు సంవత్సరాలుగా పట్టణ డీఎస్పీగా విధులు నిర్వహించిన ఏ. కారుణాకర్ ఆసిఫాబాద్ కు బదిలీ అయ్యారు. వీరి స్థానంలో హైదరాబాద్‌లో విధులు నిర్వహిస్తున్న రామానుజన్ బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. పట్టణ ప్రజలు శాంతిభద్రల పరిరక్షణకు పోలీసులకు సహకరించవలసిందిగా కోరారు.