హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను కాపాడాలని సీపీఎం పిలుపునిచ్చారు. మంగళవారం కాగజ్ నగర్ నుండి హైదరాబాద్ కు బయలుదేరిన సీపీఎం సిర్పూర్ నియోజకవర్గం కన్వీనర్ ముంజం ఆనంద్ కుమార్ ను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ.. తమను అరెస్ట్ చేయడాన్ని సిగ్గుచేటుగా భావిస్తున్నామని యూనివర్సిటీ భూములు యూనివర్సిటీకి ఉండాలని సీపీఎం డిమాండ్ చేస్తుందన్నారు.