కాగజ్‌నగర్ టౌన్ నూతన సీఐగా పీ. రాజేంద్రప్రసాద్ గురువారం బాధ్యతలు చేపట్టారు. నూతన సీఐని రిలీవ్ అయి సీఐ శంకరయ్యను ఆహ్వానించారు. టౌన్ ఎస్ఐలు ధీకొండ రమేష్, సుధాకర్, పీఎస్ఐ అనిల్, పోలీస్ స్టేషన్ సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. సీఐ మాట్లాడుతూ. పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతిఒక్క పోలీస్ అప్రమత్తంగా ఉండాలన్నారు. అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనకు ప్రజలు సహకరించాలని సూచించారు.