కాగజ్నగర్ మండలంలో గల ఎన్జిఓఎస్ కాలనీ, గ్రామపంచాయతీ పరిధిలో నిర్వహిస్తున్న సర్వే ప్రక్రియను కొమురంభీం జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా తో కలిసి పరిశీలించారు. జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ అనుమతి లేని లే-అవుట్ల క్రమబద్దీకరణ కొరకు అందిన దరఖాస్తులను రికార్డులు సరిచూసి సదరు ప్లాట్ల భౌగోళిక స్థితిని పరిశీలించి క్షేత్రస్తాయిలో పరిశీలించి ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు.