2024-25 సంవత్సరానికి గాను ఖరీఫ్ వరి ధాన్యం కొనుగోలు కొరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కొమురంభీం జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. శుక్రవారం కాగజ్‌నగర్ మండలం వంజరి గ్రామంలోని రైతువేదికలో జిల్లా అదనపు కలెక్టర్ దాసరి వేణు, సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లాలతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ. దిగుబడికి అనుగుణంగా వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని తెలిపారు.