కాగజ్‌నగర్ పట్టణంలోని సర్సిల్క్ కాలనీలో కుక్కల బెడద ఎక్కువగా ఉంది. వీధుల్లో రోడ్లపై పిచ్చి కుక్కలు గుంపులు గుంపులుగా స్వైరవిహారం చేస్తూ పిల్లలను పెద్దలను రోడ్లపై వెంబడిస్తుండడంతో పలువురు గాయాల పాలవుతున్నారు. కుక్కలు కనబడితే చాలు కాలనీ ప్రజలు భయంతో వణుకుతున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.