అభివృద్ధి పేరుతో వేల ఎకరాల అటవీ భూములను కార్పొరేట్లకు కట్టబెట్టే నిర్ణయాలు మానుకోవాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. కొమురం భీమ్ 84వ వర్ధంతి సందర్భంగా గురువారం కాగజ్నగర్ సీపీఎం కార్యాలయంలో భీం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. వారు మాట్లాడుతూ.. నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసి ప్రాణాలర్పించిన మహాయోధుడు కొమురంభీం అని కొనియాడారు. భీం ఆశయ సాధనకోసం కృషి చేయాలన్నారు.