గుండి వాగుపై తాత్కాలిక వంతెన పనులు పూర్తి
ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి సహకారంతో గుండి తాజా మాజీ సర్పంచ్ చొరవ తీసుకుని గుండి పెద్దవాగు వద్ద తాత్కాలిక వంతెన నిర్మాణం పూర్తి చేశారు. మొరం వేసి, సిమెంట్ గొట్టాలను అమర్చి శుక్రవారం నాటికి తాత్కాలిక వంతెన పూర్తి చేయడంతో గుండి ప్రజల కష్టాలు తీరాయి. ప్రజలకు రాకపోకలకు ఇబ్బందులు కల్గకుండా తాత్కాలిక వంతెన ఏర్పాటు చేయడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.