కొమురం భీమ్ జిల్లాలో భగ్గుమన్న వర్గపోరు
కొమురం భీమ్ జిల్లాలో కాంగ్రెస్ నాయకులు స్టేజిపైనే కొట్టుకున్నారు. పరస్పరం కుర్చీలు విసురుకుంటూ ఘర్షణ పడ్డారు. శనివారం జిల్లా కేంద్రంలోని రోజ్‌గార్డెన్‌లో నిర్వహించిన కుల గణన సమావేశంలో ఈ ఘర్షణ తలెత్తింది. సమాచారం లేకుండా సమావేశం ఎలా నిర్వహిస్తారని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు విశ్వ ప్రసాద్‌రావును నియోజకవర్గ ఇన్చార్జి శ్యాంనాయక్, అతని వర్గీయులు నిలదీయడంతో గొడవకు దారితీసింది