TG: మెదక్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని పద్మనాభ స్వామి గుట్ట వద్ద చేగుంట - మెదక్ రోడ్డుపై ఉన్న బస్టాండ్ సమీపంలో ఆదివారం ఓ వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్న మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. గుర్తుతెలియని దుండగులు వ్యక్తిపై పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.