మహిళలను, బాలికలను వేధించే వారికి కఠిన చర్యలు తప్పవని ఆసిఫాబాద్ షీ టీం ఇంచార్జ్ సునీత అన్నారు. శనివారం ఆసిఫాబాద్ మండలం లోని బాబాపూర్ మైనార్టీ పాఠశాల నందు విద్యార్థినులకు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించి మాట్లాడారు. ఎవరైనా వేధింపులకు గురైతే వెంటనే షీ టీం నెంబర్ 8712670564 లేదా డయల్ 100 కి సమాచారం అందించాలని సూచించారు. పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థినులు, షీ టీం సిబ్బంది పాల్గొన్నారు.