AP: కార్తీక మాసం సందర్భంగా నంద్యాల జిల్లాలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ శిరివెళ్ళ కేంద్రంలో శ్రీ ఓంకారేశ్వర దేవాలయం ఉంది. అయితే ఆదివారం ఆలయం గర్భ గుడిలోని శివుడిని సూర్య కిరణాలు తాకాయి. ఉదయం 6:30 గంటల నుండి 20 నిమిషాల పాటు శివయ్యపై సూర్య కిరణాలు ప్రసరించాయి. ఈ అద్భుత దృశ్యాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.