AP: కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలో దారుణం చోటు చేసుకుంది. మతిస్థిమితం లేని మహిళపై అత్యాచారం జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో రాముడు అనే వ్యక్తి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, గత నెల కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలో ప్రేమోన్మాది చేసిన పనికి ఓ అమ్మాయి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.