జైనూర్ మార్లవాయి గ్రామపంచాయతీ కారోబారి జూగ్నక సోనేరావ్ భార్య రాధ బాయి ఆదివారం తెల్లవారుజామున అనారోగ్యంతో మృతి చెందింది. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఆత్రం సుగుణక్క మార్లవాయిలోని వారి నివాసానికి వెళ్లి పార్థివ దేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించి, రాధ బాయి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.