తిర్యాణి మండలంలోని ఉపరితల బొగ్గు గనుల్లో స్థానిక నిరుద్యోగ ఆదివాసి యువతీ యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించాలని ఆదివాసి హక్కుల పోరాట సమితి (తుడుం దెబ్బ) డివిజన్ అధ్యక్షులు గెడం సుభాష్, మండల అధ్యక్షులు తుడసం భాస్కర్ సింగరేణి అధికారులను కోరారు. మంగళవారం గోరేటిలోని జిఎం కార్యాలయాన్ని సందర్శించి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిర్వాసిత ప్రాంతమైన తిర్యాణి మండలంలో చదువుకున్న ఆదివాసి యువకులకు సరైన ఉపాధి అవకాశాలు లేక రోడ్డున పడుతున్నారు అన్నారు.