రెబ్వెన మండలం గోలేట్ లో బెల్లంపల్లి ఏరియా రీజియన్ జీఎం క్వాలిటీ సుశాంతసాహా గురువారం పర్యటించారు. మొదటిసారిగా ఏరియాకు వచ్చిన సందర్భంగా బెల్లంపల్లి ఏరియా జీఎం ఎం శ్రీనివాస్ అధికారులతో కలిసి ఆయనను సన్మానించారు. అంతకు ముందు ఆయన ఖైరగుర ఓసి, గోలేటి సీహెచ్పిని సందర్శించారు. బొగ్గు నాణ్యతపై సిబ్బందికి మార్గనిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఒటు జీఎం రాజమల్లు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.