కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో విద్యా, వైద్యం రంగాలలో అనేక సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించాలని గతం నుంచి కొమురంభీం జిల్లా కలెక్టర్ వేంకటేశ్ దౌత్రెకు అనేకమార్లు వినతిపత్రాలు ఇచ్చినప్పటికి వాటిని పరిష్కరించకుండా చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని డీవైఎఫ్ఐ నాయకులు ఆరోపుంచారు. బుధవారం జిల్లా కలెక్టర్ ను మార్చాలని కోరుతూ.. మంత్రి సీతక్కకు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇచ్చారు.